ఆ డైరక్టర్ తో యశ్.. భారీ కాంబో ఫిక్స్..!

shami
KGF సినిమాతో నేషనల్ లెవల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యశ్ కె.జి.ఎఫ్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దాని మీద అందరికి ఆసక్తి కలిగింది. అయితే కె.జి.ఎఫ్ చాప్టర్ 3 కూడా త్వరలో వస్తుందన్న వార్తలు వచ్చాయి. ఇదిలాఉంటే కె.జి.ఎఫ్ తర్వాత యశ్ తన నెక్స్ట్ సినిమా నర్తన్ అనే డైరక్టర్ తో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కన్నడ దర్శకుడైన నర్తన్ అక్కడ క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.  

శివ రాజ్ కుమార్ తో మఫ్తీ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న నర్తన్ ఇప్పుడు యశ్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా దాదాపు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ తో 1000 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా మారిన యశ్ తను నెక్స్ట్ చేసే సినిమాలతో కూడా అదే రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు.

అంతేకాదు యశ్ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు యశ్ తో సినిమా ప్లానింగ్ లో ఉందన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరక్టర్స్ కూడా యశ్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. కె.జి.ఎఫ్ కి ముందు కన్నడ హీరోగా మాత్రమే ఉన్న యశ్ ఆఫ్టర్ కె.జి.ఎఫ్ నేషనల్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే అతనితో సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. యశ్, నర్తన్ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ఆ సినిమా మిగతా విషయాలు ఏంటన్నది త్వరలో తెలుస్తాయి. తెలుగుతో పాటుగా హిందీ మేకర్స్ కూడా యశ్ తో సినిమా ప్లానింగ్ ఉన్నారని తెలుస్తుంది.ఇక నర్తన్ తర్వాత యశ్ తెలుగు దర్శకుడితో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలో ఫైనల్ అవుతుందని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: