#NBK108 : బాలయ్యకు ప్రియమణి సెట్.. ఎందుకంటే?

Purushottham Vinay
ప్రస్తుతం మలినేనీ గోపీచంద్‌తో తన 107వ సినిమా చేస్తోన్న బాల కృష్ణ ఆ వెంటనే అనిల్ రావిపూడి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఎఫ్ 3 సినిమా సక్సెస్ ఇంటర్వ్యూల్లో సైతం అనిల్ రావిపూడి #NBK108 చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇది తండ్రి ఇంకా కూతురు మధ్య నడిచే కథ అని.. 50 ఏళ్ల వయస్సు ఉన్న తండ్రికి తన కూతురుతో ఉన్న అనుబంధం ఏంటి ? అన్నదే ఈ సినిమా స్టోరీ అని ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పేశాడు. ఇక అలాగే బాలయ్య కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కనిపిస్తారని కూడా అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.మధ్య వయస్సులో ఉన్న బాలకృష్ణ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో ? సినిమా చూశాక మెస్మరైజ్ అయ్యేలా సినిమా ఉంటుందని అనిల్ రవీపూడి చెపుతున్నాడు. ఇక ఈ సినిమాలో బాల కృష్ణ కి జోడీగా ఎవరు నటిస్తారు ? అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఇక తాజా అప్‌డేట్ ప్రకారం సీనియర్ నటి ఇంకా జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత ప్రియమణి అయితే ఈ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భావించి ఆమె పేరుని ఫైనలైజ్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.అలాగే అఖండ సినిమాలో ప్రగ్య జైశ్వాల్‌తో రొమాన్స్ చేసిన బాలయ్య.. ఇప్పుడు #NBK107 లో శృతిహాసన్ తో జత కడుతున్నారు.




ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో వయస్సు పైబడిన పాత్ర కావడంతో కాస్త ఏజ్ ఉన్న హీరోయిన్‌నే తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ప్రియమణి పేరుని ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది? వెంకీతో చేసిన నారప్ప సినిమాలో కూడా ముగ్గురు పిల్లల తల్లిగా నటించిన ప్రియమణి ఇప్పుడు బాలయ్యకు భార్యగా ఇంకా యంగ్ హీరోయిన్ శ్రీలీలకు తల్లిగా కనిపించబోతోందన్నమాట.ఈ సినిమాలో పలు ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లోనే ప్రియయణి సీన్లు ఉంటాయని అంటున్నారు. గతంలో బాలయ్య ఇంకా ప్రియమణి కలిసి మహదేవ్ దర్శకత్వం వహించిన మిత్రుడు సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రెండోసారి వీరిద్దరూ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి చెపుతూ పోకిరి - గబ్బర్‌సింగ్ - అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లా హీరో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఏదేమైనా వరుస హిట్లతో ఉన్న అనిల్ రావిపూడి బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తాడో ? అన్న అంచనాలు అయితే ఇప్పుడు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: