లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ , సూర్య కూడా నటించారు. ఈ మూవీ ట్రైలర్ లో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ పాత్రలను రివిల్ చేసిన చిత్ర బృందం సూర్య పాత్రను మాత్రం ఏ మాత్రం కూడా రిలీజ్ చేయలేదు .
అది మాత్రమే కాకుండా సూర్య పాత్రపై చిత్ర బృందం అంచనాలను కూడా పనిచేస్తుంది. ఇది ఇలా ఉంటే విక్రమ్ మూవీ ని జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. విక్రమ్ మూవీ విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ విక్రమ్ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కమల్ హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కమల్ హాసన్ కు కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ఎప్పుడు సినిమా చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది.
ఆ ప్రశ్నకు కమల్ హాసన్, విజయ్ డేట్ లు దొరికినప్పుడు చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. ఇలా విజయ్ గురించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి. ఇది ఇలా ఉంటే విశ్వరూపం మూవీ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న సినిమా కావడంతో విక్రమ్ మూవీ పై కమల్ హాసన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విక్రమ్ మూవీ కి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.