సాయి ధరమ్ తేజ్ పై క్షుద్ర పూజలు..కథ ఇదే..!

Satvika
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన సొంత టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాల ను తెలుగు ప్రేక్షకులను అందించారు. అలా కొన్ని సక్సెస్ ను అందుకొగా, మరి కొన్ని బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నారు.. అయితే ఈ మధ్య రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. ఆ దెబ్బ తో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గాయాల నుండి కోలుకున్న తేజు రీసెంట్‌గా మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయాడు.



ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లోని 15 వ చిత్రాన్ని కార్తిక్ వర్మ దండు డైరెక్షన్‌ లో తెరకెక్కిస్తున్నాడు. సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కు సుకుమార్ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తేజు ముంబై నుండి వచ్చిన ఓ యంగ్ ఇంజినీర్ పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పై ఇక్కడ క్షుద్రపూజలు జరుగుతాయట. దీంతో అసలు తనపై క్షుద్రపూజలు ఎవరు జరిపించారు? అనే కోణం లో ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.


ఇప్పటివరకు తేజ్ ఎప్పుడూ కనిపించని విధంగా ఈసినిమా లో కనిపించనున్నాడు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తం గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.. మరి ఈ సినిమా అన్నా తేజ్ ను హిట్ టాక్ ను అందిస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: