యాంకర్ సుమ టూర్ వెనుక అసలు కారణం ఇదా?
కాగా, ప్రస్తుతం సుమ గత కొన్ని రోజుల నుంచి న్యూ యార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక యాంకర్ రవి కూడా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. వీరంతా వెకేషన్‌లో భాగంగా ఇలా వెళ్లి ఉంటారని అంతా భావించారు.వీళ్ల సొంత ఖర్చుతోనే అక్కడకు వెళ్లి ఉంటారని అనుకుంటే.. అసలు విషయం ఇప్పుడు తెలిసి వచ్చింది. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల గురించి అందరికీ తెలిసిందే. నాటా, ఆట, పాట,తానా అంటూ ఇలా లెక్కలేనన్ని తెలుగు సంఘాలుంటాయి.
ఇక వీరంతా కూడా మన సెలెబ్రిటీలను అక్కడకు ఆహ్వానించి సన్మానిస్తుంటారు. అన్ని ఖర్చులు వారే భరిస్తుంటారు. అలా మొత్తానికి మన వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి సంఘాలు పిలిచినప్పుడు వెళ్తారు. అక్కడ ఈవెంట్లు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా సుమ, రవి వంటి వారు అక్కడకు వెళ్లినట్టు కనిపిస్తోంది. సుమ అందుకే న్యూయార్క్‌కి వెళ్లినట్టుంది. ఇక గత మూడు నాలుగు రోజులుగా సుమ అక్కడ చేస్తోన్న హంగామా అంతా కాదు. అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో తిరుగుతూ నానా హంగామా చేస్తోంది.
వినోదరంగానికి తాను చేసిన సేవలకు గుర్తుగా తనకు ఈ సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి థ్యాంక్స్ చెప్పింది. మొత్తానికి ఈ టాటా ఇచ్చిన ఆతిథ్యానికి సుమ ఫిదా అయినట్టుంది. అయితే ఇలాంటి ఈవెంట్లకు వెళ్లిన సమయంలో ఖర్చంతా వారే భరిస్తారని సమాచారం. ఇలా మొత్తానికి వెకేషన్‌ను ఎంజాయ్ చేసిన సుమ.. కొన్ని రోజులు ఇలా షూటింగ్‌లకు దూరంగా ఉండిపోయింది. అసలే వారంలో అన్ని రోజులు సుమ పని చేస్తుంటుందని టాక్.. సుమ ఎంత బిజిగా ఉన్నా కూడా ఆదివారం వచ్చింది అంటే కేవలం ఫ్యామిలితో ఎంజాయ్ చేయడానికి టైం కేటాయిస్తుంది.. జయమ్మ పంచాయితి మంచి టాక్ ను అందుకుంది..ఇక యాంకరింగ్ కు గుడ్ బై చెబుతోందా .. లేదా.. రెండు చేస్తుందా అనేది చూడాలి..