అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన సూర్య..

Satvika
సినిమాలంటే చాలా మంది ఇష్టం ఉంటుంది.. అంతకు మించి పిచ్చి కూడా ఉంటుంది.. ఆ సినిమాలో ఎవరూ బాగా చేస్తె వారికి ఫ్యాన్ అయిపోతారు.. వాళ్ళ సినిమా వస్తుంది అంటే పిచ్చి తో ఊగిపొథారు. సినిమాలు హిట్ అవ్వాలని కూడా ఎన్నెన్నో చేస్తారు. ఆ హీరోలు అంటే వాళ్ళకు ఎంత అభిమానం ఉందో తెలిసేలా చేస్తారు.. కొన్ని సంధర్భాల్లొ కలుస్తారు కూడా. ఇలా చాలా మంది వీరాభిమానులు హీరో లను కలిశారు. వారి గురించి హిరొలకు చెబుతారు.. కొంతమంది హీరోలు చలిచి పోయి వారి కష్టాల ను తీర్చెందుకు ముందుకు వస్తారు.

 

ఇపుడు ఓ స్టార్ హీరో తన అభిమాని కష్టాల ను తీర్చెందుకు ముందుకు వచ్చాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదం లో మరణించిన తన అభిమాని కుటుంబాన్ని సూర్య పరామర్శించి ఆదుకుంటాన ని భరోసా ఇచ్చారు. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా సూర్య అభిమాన సంఘం కార్యదర్శి జగదీశన్‌ ఇటీవల మోటార్‌ సైకిల్‌ పై వెళుతుండగా నామక్కల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపం లో లారీ ఢీకొని మృతి చెందాడు.

 

ఆ విషయాన్ని విని తట్టుకోలే ని హీరో సూర్య  అతని ఇంటికి వెళ్ళి అతని భార్య, పిల్లలను పరామర్శించి, కుటుంబ సభ్యుల కు ధైర్యం చెప్పాడు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు గా ఆదుకుంటానని భరోసా ఇచ్చి, వారి రెండున్నరేళ్ల కూతురు విద్యకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సూర్య వచ్చిన విషయం తెలిసి ఆ ప్రాంతం ప్రజలు ఆయన్ని చూడటానికి గుమిగూడారు. సూర్య ఉదారతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ ఒక్క విషయం తో సూర్య మళ్ళీ స్టార్ హీరో అయ్యాడు. అతని మంచి మనసు పై అందరు అభినందిస్తున్నారు.. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తమిళ సినిమాల తో బిజిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: