అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల కాబోతున్న 'విరాటపర్వం' అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన దగ్గుపాటి రానా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి రానా ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. రానా కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా హిందీ , తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.


అలాగే రానా 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు.  ఇలా  ఇండియా వైడ్ గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రానా తాజాగా విడుదలైన భీమ్లా నాయక్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. భీమ్లా నాయక్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రానా 'విరాట పర్వం' సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేది అనేక సార్లు వాయిదా పడింది. చివరకు ఈ సినిమాను జులై 1 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.


కాకపోతే ఈ సినిమాను జూలై 1 వ తేదీన కాకుండా అంతకుముందే జూన్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇలా విరాటపర్వం సినిమాను చెప్పిన తేదీ కంటే ముందే చిత్ర బృందం థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ చేసింది. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో విరాటపర్వం సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: