నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అని అంటున్న ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య తన వారసుడు ఎంట్రీ కోసం డైరెక్టర్ ని ఫైనల్ చేసినట్లు గా సమాచారం వినిపిస్తోంది. ఇప్పటివరకు మోక్షజ్ఞ తొలి సినిమా పై అధికారిక సమాచారం అయితే రాలేదు. ఆ మధ్య మోక్షజ్ఞ కొత్త సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని ఈ వార్తలు వినిపించాయి. అయితే పూరి జగన్నాథ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అది సాధ్యపడలేదు.
అలాగే బాలయ్య హీరోగా నటించిన ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ అయింది. కానీ ఇంకా సెట్స్ పైకి రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. గత కొంత కాలంగా మోక్షజ్ఞ తన తండ్రి సూచన మేరకు జిమ్ లో బాగా కష్టపడి ఫుల్ షేప్ కు వచ్చాడట. దీంతో త్వరలోనే మోక్షజ్ఞ సినిమా ప్రారంభం కానుందని క్లారిటీ వచ్చేసింది. మరి మోక్షజ్ఞ ను లాంఛ్ చేసే డైరెక్టర్ ఎవరు? అంటే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. అనిల్ రావిపూడి అయితే మోక్షజ్ఞ హీరోగా సేఫ్ గా లాంచ్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తన హీరో కామెడీ నుండి ఫైట్స్ ,రొమాన్స్ అన్నీ చేస్తూ ఉంటారు.
కాబట్టి
మోక్షజ్ఞ ప్రతిభను మన తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తించాలి అంటే కచ్చితంగా ఆ దర్శకుడే పర్ఫెక్ట్ అని నిర్ణయించుకున్నారట బాలయ్య. ఇక త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించాలని బాలకృష్ణ సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఇక మరికొద్ది రోజుల్లోనే మోక్షజ్ఞ కొత్త సినిమాకు సంబంధించి స్వయంగా బాలయ్యే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు...!!