కార్తికేయ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ..రిలీజ్ ఎప్పుడంటే?

Satvika
ఒక సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా మరో సినిమా ప్రెక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్య చాలా సినిమాలు అలానే వచ్చాయి. తాజాగా మరో సినిమా కూడా సీక్వెల్ కు రెడీ అయ్యింది.ఆ సినిమా నే కార్తికేయ 2..హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ బెస్ట్ మూవీ 'కార్తికేయ'కు సీక్వెల్ మూవీగా 'కార్తికేయ-2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా మిస్ కాకుండా ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్. ఇక తొలి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు చందు ముండేటి, ఈ సీక్వెల్ మూవీని కూడా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుకుటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది...



గతంలో వచ్చిన సినిమా మంచి సస్పెన్ తో ప్రెక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఎంత హిట్ టాక్ ను అందుకుందొ అందరికి తెలుసు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుందని, చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో ఈ సినిమాను జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కార్తికేయ-2 సినిమా నుండి ఓ అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

 

జూన్ 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను రేపు(జూన్ 1) ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్ గా నటిస్తోండటంతో, ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి..మరి సినిమా జనాల ఊహకు రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: