పవన్-రాజమౌళి కాంబినేషన్ లో చిత్రం సాధ్యమేనా..?
RRR సినిమా సక్సెస్ కావడంతో రాజమౌళి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు . తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఒక బడా ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి రాజమౌళి , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్ల క్రితమే పలుమార్లు చర్చలు జరిపినా కూడా అది ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఒకానొక సందర్భంలో తెలియజేశారు.
కథ రెడీ చేసుకొని పవన్ కి వినిపించాలనుకున్నాను కానీ ఆయన దగ్గర నుండి ఎలాంటి పిలుపు రాలేదని దాంతో పవన్ తో చేయాలనుకున్నది సినిమా.. చాలా ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను అని తెలిపారు రాజమౌళి. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ , రాజమౌళి థింకింగ్ మారిపోయింది అని ఇద్దరూ కూడా వేర్వేరు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని రాజమౌళి తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఆశించడం అత్యాశే అవుతుందని మరికొందరు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబో గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబుతో చేసే సినిమా 2024 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం అయిపోయిన.. పవన్ తో సినిమా తీస్తారో చూడాలి మరి.