అర్థంకాని సమస్యగా మారిన పుష్ప 2 !
నిన్న మొన్నటి వరకు ‘పుష్ప 2’ షూటింగ్ జూన్ నెల తప్పితే జూలై నుండి ప్రారంభం అవుతుందని లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈమూవీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేఅవకాశం ఉంది అంటున్నారు. దీనికికారణం ఈ సీక్వెల్ కథలో జరుగుతున్న మార్పులతో పాటు ఈమూవీ స్క్రీన్ ప్లే విషయంలో కూడ సుకుమార్ చాల జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్.
వాస్తవానికి ఈ సీక్వెల్ కథకు సంబంధించిన స్క్రీన్ ప్లేను సుకుమార్ పూర్తి చేసి నాలుగు ఐదు నెలలు అయినప్పటికీ ‘కేజీ ఎఫ్ 2’ ఘన విజయంలో కీలక పాత్రను పోషించిన ఆమూవీ స్క్రీన్ ప్లేను చూసిన తరువాత సుకుమార్ ఆలోచనలు అన్నీ మారిపోయినట్లు టాక్. దీనికితోడు ‘కేజీ ఎఫ్ 2’ ను చూసిన తరువాత ‘పుష్ప 2’ విషయంలో భారీ యాక్షన్స్ సీన్స్ తో పాటు ఇప్పటివరకు ఏతెలుగు సినిమా తీయని అద్భుతమైన లోకేషన్స్ తో తీయాలని సుకుమార్ ఒక స్థిర నిర్ణయానికి రావడంతో ‘పుష్ప 2’ విషయంలో చాల మార్పులు చేర్పులు చాలవేగంగా జరుగుతున్నట్లు టాక్.
ఈమూవీని ప్రపంచ వ్యాప్తంగా సుమారు తొమ్మిది దేశాలలో వివిధ లోకేషన్స్ లో తీయడానికి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ డిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ సీక్వెల్ లో అల్లు అర్జున్ పక్కన రష్మికతో పాటు మరొక బాలీవుడ్ బ్యూటీ కూడ ఎంపిక చేసే విషయంలో అనేక ఆలోచనట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సీక్వెల్ లో ‘పుష్ప’ పార్ట్ వన్ లో కనిపించని అనేక కొత్త పాత్రలు కూడ వస్తాయని అంటున్నారు.
దీనితో ఈమూవీ బడ్జెట్ 400 కోట్లకు చేరడం ఖాయం అంటున్నారు. అంతేకాదు ఈ సీక్వెల్ ను దర్శకత్వం వహించినందుకు సుకుమార్ కు 50 కోట్ల పారితోషికం ఈ సీక్వెల్ లో నటించినందుకు అల్లు అర్జున్ కు 75కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారని వార్తల హడావిడి జరగబోతోంది. ఈ వార్తలే నిజం అయితే అల్లు అర్జున్ సుకుమార్ లు తమ కెరియర్ లో ఎవరు ఊహించని పారితోషికం అందుకోబోతున్నారని అనుకోవాలి..