బోయపాటి శ్రీను , రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతునట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో తెరకెక్కించబోయే మూవీ ని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించ బోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన కూడా చిత్ర బృందం ఇది వరకే చేసింది. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల బడ్జెట్ ను నిర్మాతలు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బోయపాటి శ్రీను , రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమాలలో హీరో రామ్ పోతినేని , దర్శకుడు బోయపాటి శీను పాల్గొన్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. జూలై 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు ,తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బోయపాటి శ్రీను బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా అఖండ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాపై ఇప్పటినుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.