ఇప్పటికే ఈ
సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ
మూవీ లో
దగ్గుబాటి రానా నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనేక సార్లు విడుదల వాయిదా పడిన విరాట పర్వం
మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ ని జులై 1 వ తేదీన కాకుండా
జూన్ 17 వ తేదీనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ముందు చెప్పిన తేదీ కంటే ముందుగానే ఈ
మూవీ ని
థియేటర్ లలోకి చిత్ర బృందం తీసుకు రాబోతుంది. ఇలా ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడటంతో విరాట పర్వం చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేస్తుంది.
అందులో భాగంగా ఈ
సినిమా నుండి ఒక సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. విరాట పర్వం
సినిమా లో నుండి 'నగాదారిలో' అనే సాంగ్ ను రేపు ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు
సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా,
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ,
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.