అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి కన్నా ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇలా అనేక తెలుగు సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న రాశి కన్నా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇందులో ఒకటి గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ. ఈ సినిమా జులై 1 వ తేదిన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు ఈ సినిమాతో పాటు రాశి ఖన్నా , నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. రాశి ఖన్నా ప్రస్తుతం తెలుగులో నటించిన పక్కా కమర్షియల్ , థాంక్యూ సినిమాలు కేవలం ఒక వారం గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి ఇలా రాశి ఖన్నా ఒక వారం గ్యాప్ తో నటించిన రెండు సినిమాలతో బాక్స్ ఆఫీసు దగ్గర రచ్చ చేయబోతుంది. మరి రాశి ఖన్నా ఈ రెండు సినిమాలతో ఇలాంటి విషయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.