మహేష్ సినిమా మరింత ఆలస్యం అవనుందా..!!

P.Nishanth Kumar
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా షూటింగ్ జూన్ చివరి వారం నుంచి మొదలు కాబోతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఎంతో వెరైటీ గా ఈ చిత్రం ఉండబోతుంది అని అంటున్నారు. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రీవీల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఇంత ఆలస్యంగా మొదలవ్వడం రాజమౌళి సినిమా పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు మహేష్ అభిమానులు.

వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో ని మహేష్ బాబు సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా కరోనా కారణంగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం ఆలస్యం అయింది. దాంతో ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న కూడా మహేష్ బాబు డేట్లు దొరకకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టలేకపోయాడు. ఫైనల్ గా ఈ సినిమా యొక్క షూటింగ్ జూన్ చివరి వారం నుంచి మొదలు కావడంతో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ రోజులలో ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

అయితే రాజమౌళి సినిమా అంటేనే ఎన్నో సంవత్సరాలతో కూడుకున్న పని. అలాంటి సమయంలో ఆ చిత్రాన్ని అనుకున్న సమయానికి కంటే ఎక్కువగా లేట్ చేసి మొదలుపెడితే తప్పకుండా ఆ సినిమాపై మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి మహేష్ సినిమా ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఆరు నెలల వ్యవధిలో మహేష్ బాబు తో సినిమా పూర్తి చేసి రాజమౌళికి అప్పగిస్తాడా అనేది చూడాలి. సినిమాలు తెరకెక్కించడంలో త్రివిక్రమ్ పెద్దగా సమయాన్ని తీసుకోడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంత త్వరగా తెరకెక్కిస్తే అంత త్వరగా మహేష్ రాజమౌళి సినిమాకు వెళ్ళిపోవచ్చు. మహేష్ అభిమానులు అయితే రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతోందా అని చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: