ప్రభాస్ : ఆ టాలెంటెడ్ దర్శకుడిని రిజెక్ట్ చేసి తప్పు చేశాడా?

Purushottham Vinay
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తప్పు చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈ సూపర్ హీరో..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా పాపులర్ అయిపోయాడు.ఇక బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి కొన్నీ ఏళ్ళు గడుస్తున్న ఇంకా ఆయనని అమరేంద్ర బాహుబలిగా నే గుర్తిస్తున్నారు. బాహుబలి సినిమా తరువాత ఇక ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు. ఆ రెండూ కూడా అట్టర్ ఫ్లాప్ టాక్ ను దక్కించుకున్నాయి. అయినా కానీ ప్రభాస్ కి పాన్ ఇండియా  క్రేజ్ తగ్గలేదు.ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న డార్లింగ్ హీరో..చేతిలో మొత్తం ఐదు ప్రాజెక్ట్స్ రెడీ గా ఉన్నాయి.ఇక రీసెంట్ గా ప్రభాస్ కు స్టోరీ వినిపించిన ఓ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ ని నిరాశ పరిచాడట డార్లింగ్ హీరో. దీంతో ఈ విషయం ఇందస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది . మనకు తెలిసిందే ఆ డైరెక్టర్ పేరు లోకేష్ కనగరాజ్‌. మారుతీ లాంటి పిచ్చి పిచ్చి డైరెక్టర్ లకి అవకాశం ఇస్తున్న ప్రభాస్ ఇంత టాలెంట్ వున్న లోకేష్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు.ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా స్టార్స్ తో సినిమాలు తీసి వాళ్లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు లోకేష్.





ఇక తమిళంలో 'ఖైదీ', 'మాస్టర్' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి.. ఇప్పుడు కమల్ హాసన్‌తో 'విక్రమ్' అనే పాన్ ఇండియా సినిమాతో కమల్ కెరీర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నాడు లోకేష్ కనగరాజ్‌. దీంతో ఆయన పేరు కూడా ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. అయితే, సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ని కలిసి తాను అనుకున్న ఓ స్టోరీని వినిపించాడట.అయితే, కధలో కొన్ని కీ పాయింట్స్ అనేవి గజిబిజీ గా ఉన్నాయంటూ..బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అతనికి చెప్పారట ప్రభాస్. దీంతో కనగరాజ్ ..సార్, స్టోరీలో ఆ లైన్స్ ఛేంజ్ చేస్తాను అని చెప్పినా కూడా వినకుండా పాపం ఆయనను అవాయిడ్ చేశారట. దీంతో కనగరాజ్ బాగా హర్ట్ అయ్యిన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాటర్ సినీ ఇండస్ట్రీలో బాగా హీట్ పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: