ఆ రైటర్ కి ఛాన్స్.. బాలయ్య నువ్వు సూపరంతే..!
అన్ స్టాపబుల్ షో సక్సెస్ అవడానికి బాలకృష్ణ తనయురాలు తేజశ్విని కూడా ఒక కారణమని తెలుస్తుంది. బాలయ్య లుక్ విషయంలో ఆమె జాగ్రత్త తీసుకున్నారట. ఇక ఇదిలాఉంటే అన్ స్టాపబుల్ రైటర్ గా సూపర్ సక్సెస్ అయిన బివిఎస్ రవి బాలయ్యతో సినిమా చేస్తారని లేటెస్ట్ టాక్. అన్ స్టాపబుల్ షో టైం లో బాలయ్యతో కుదిరిన సింక్ తో తన దగ్గర బాలయ్య కోసం రాసిన కథ వినిపించాడట బివిఎస్ రవి. కథ నచ్చడంతో బాలకృష్ణ కూడా బివిఎస్ రవికి ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడితో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత మూవీ బివిఎస్ రవి చేసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
కథ నచ్చితే డైరక్టర్ మీద పూర్తి నమ్మకం ఉంచే వారిలో బాలయ్య బాబు ఒకరు. అందుకే ఆయన చేస్తున్న సినిమాల్లో సక్సెస్ ఫైల్యూర్స్ అన్ని డైరక్టర్స్ కే తప్ప బాలకృష్ణ ఎప్పుడూ ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అవలేదు. ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న బాలయ్య రానున్న సినిమాలతో మరింత సక్సెస్ అందుకునేలా ఉన్నారని చెప్పొచ్చు. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్న బాలయ్య నందమూరి ఫ్యాన్స్ ని అలరించే సినిమాలతో వస్తున్నారు.