నువ్వేకావాలి హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

Divya
దీపం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటూ ఉంటారు అందుచేతనే హీరోయిన్లు సైతం ఎక్కువగా ఇలాంటి విషయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే హీరోలు కెరియర్ ఉన్నంతకాలం హీరోయిన్స్ కెరియర్ ఎక్కువగా ఉండదు అతి తక్కువ సమయం ఉంటుంది. అలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ కూడా ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నువ్వేకావాలి సినిమా లో నటించిన రీచా మల్లాడ్ కూడా ఒకరు.

నువ్వేకావాలి సినిమా తో మంచి విజయాన్ని అందుకొని ఆ తరువాత ఇక ఎక్కడా కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు రీచా ఏం చేస్తోందో తెలుసుకుందాం. 1980 ఆగస్టు 30న రీచా మల్లాడ్ జన్మించింది సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తన అడుగులను సినీ ఇండస్ట్రీ వైపు వేసింది. హిందీ తెలుగు కన్నడ మలయాళం తదితర భాషలలో నటించింది..  200కు పైగా యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. నువ్వేకావాలి సినిమా హిట్ గా మారడంతో ఈమె కెరియర్ పూర్తిగా  మారిపోతుందని అందరూ అనుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో ఈమె రాణించలేకపోయింది.
ఇక 2011లో హిమనుష్ బజాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది 2013లో వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు ఆ తర్వాత 2016లో మలుపు అనే సినిమా త సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పేసింది కానీ ప్రస్తుతం 41 వయసులో ఉన్న కూడా హీరోయిన్గా నటిగా ఆకట్టుకోలేకపోయిన డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రం బాలీవుడ్లో రాణిస్తున్నట్ల సమాచారం. ప్రస్తుతం విడుదల అవుతున్న బాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా రీచానే డబ్బింగ్ చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఏదిఏమైనా కేవలం2 చిత్రాలతోనే తన కెరియర్ ని ముగిసేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మరి సెకండ్ ఇన్నింగ్స్ తోనైనా నా బాగా ఆకట్టుకుంటుంది ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: