అడవి శేష్ 'మేజర్' ను ఎందుకు చూడాలి ?
అడవి శేష్: ఈ చిత్రంలో సందీప్ పాత్ర చేసిన అడవి శేష్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో మనకు అడవి శేష్ ఎక్కడా కనిపించడు. మొట్ట సందీప్ ఉన్నికృష్ణన్ మాత్రం ఉంటాడు, అంతగా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఇందులో అడవి శేష్ కనిపించిన అన్ని పార్శ్వాలలోనూ సందీప్ గా అదరగొట్టాడు. పిల్లాడిగా, స్టూడెంట్ గా, లవర్ గా, సోల్జర్ గా వరల్డ్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇతని నటన చూడడానికి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిందే.
క్లైమాక్స్: ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మరో కారణం క్లైమాక్స్. కథకు అవసరం అయిన విధంగా ఇందులో దేశభక్తిని హైలైట్ చేశారు. ఇక పతాక సన్నివేశాలలో అయితే మనసును హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి మనిషికి కన్నీరు తెప్పిస్తాయి. అడవి శేష్ క్లైమాక్స్ లో మరో లెవెల్ లో నటించాడని చెప్పాలి. ఇక మేజర్ సినిమాలో అడవి శేష్ లేకపోతే బాగోదు అనేంతలా ఇచ్చి పడేశాడు.
దర్శకత్వ ప్రతిభ: మేజర్ చిత్రానికి శశికిరణ్ తిక్క డైరెక్టర్ గా చేశాడు. మొదటి నుండి ఆఖరి వరకు ప్రతి షాట్ ను ప్రత్యేకంగా తీసుకుని సినిమా హిట్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రేక్షకులలోకి ఎమోషన్ ను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్కరూ సినిమాలో పాత్రలను మాత్రం ఫాలో అయ్యేలా స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు. అప్పటికే మేజర్ సందీప్ చనిపోయి ఉంటాడు.. అయితే గతాన్ని తన పేరెంట్స్ తో చెప్పేలా చేయడం అయితే అద్భుతమైన ఐటీసీ అని చెప్పాలి. ప్రకాష్ రాజ్ ఇతని తండ్రి పాత్రలో జీవించాడు. తన కొడుకు గురించి చెప్పే ప్రతి మాటలో ఎమోషన్, గర్వం, ప్రేమ ఇలా అన్ని అంశాలను ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు శశికిరణ్.
కథ: మేజర్ లాంటి దేశభక్తి చిత్రాన్ని ఎంచుకోవడంలోనే ఈ టీం అంతా సగం సక్సెస్ అయ్యారని చెప్పాలి. డైరెక్టర్ కథలో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా కథనాన్ని రాసుకున్నాడు. మాములుగా ఎన్నో దేశభక్తి చిత్రాలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ ఇది చాలా భిన్నంగా ఉండడం మెయిన్ పాజిటివ్. ఇక సందీప్ ప్రేమకథను కూడా దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇక సందీప్ సోల్జర్ గా ఎమోషన్స్ లు వేరే లెవెల్. ఈ సినిమాతో అడవి శేష్ కి పాన్ ఇండియా దర్శకులు ఆఫర్ చేయడం గ్యారంటీ అంటున్నారు మరికొందరు.
మీరు కొనే టికెట్ ధరకు ఏ మాత్రం తగ్గకుండా మిమ్మల్ని రెట్టింపు ఎంటర్టైన్ చేస్తుంది.