కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలగా కొనసాగుతున్న వారిలో ఖచ్చితంగా
సూర్య ఒకరు.ఈయనకు కేవలం
తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఇంకా అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది.ఇక ఈ క్రమంలోనే ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ అనేది ఎక్కువగా లభిస్తుంది.సూర్య ఎంతో గొప్ప
హీరో అయినప్పటికీ ఈయన తనలో ఉన్న మానవత్వాన్ని ఎప్పుడూ కూడా బయటపెడుతూ ఎంతోమంది చిన్నారులకు సహాయం చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు.ఇలా అగరం ఫౌండేషన్ ద్వారా
సూర్య ఎంతో మంది అనాధ చిన్నారులను చేరదీస్తూ వారి భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతున్నారు. అదేవిధంగా తన అభిమానులకు కూడా
సూర్య ఎల్లప్పుడు ఎంతో దగ్గరగా ఉంటారు. అభిమానుల పెళ్లికి వెళ్లడం ఇంకా వారికి ఏదైనా ఆపద వస్తే స్పందించడంలో ఈయన ముందుంటారు. ఈ క్రమంలోనే తాజాగా
సూర్య అభిమాని జగదీశన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఇక ఈ విషయం తెలుసుకున్న
సూర్య తన అభిమాని మృతి చెందడంతో ఎంతగానో చలించిపోయాడు.
ఈ క్రమంలోనే
సూర్య స్వయంగా తన అభిమాని ఇంటికి వెళ్లి మరీ తనకు తుది వీడ్కోలు పలికారు.ఇలా అభిమాని కోసం స్వయంగా
సూర్య వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా సూర్యని చూడగానే ఒక్కసారిగా బోరున విలపించారు.ఇక కుటుంబ సభ్యులను ఆయన ఓదారుస్తారు తమ బిడ్డను తాను తీసుకురాలేనని అయితే ఆ కుటుంబ బాధ్యతను మాత్రం తాను తీసుకుంటానని ఆయన తెలిపారు.ఇక ఈ క్రమంలోనే తన అభిమాని పిల్లలకు చదువు ఇంకా వైద్యం ఖర్చులన్నీ
సూర్య ఫౌండేషన్ ద్వారా అందించనున్నట్లు ఈ సందర్భంగా
సూర్య తన అభిమాని కుటుంబానికి భరోసా కల్పించారు.ఇలా అభిమానుల పట్ల ఎంతో గొప్ప మనసు చాటుకున్న
హీరో సూర్య రీల్
హీరో కాకుండా రియల్
హీరో అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇక
సూర్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన
బాలా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.