F3 వసూళ్లు : ఇప్పటిదాకా ఒకే! ఇక నుంచి కష్టమేగా!

Purushottham Vinay
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్3'. 2019వ సంవత్సరంలో వచ్చిన 'ఎఫ్2' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంకా శిరీష్ లు నిర్మించారు.సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ ఇంకా అలాగే రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ కూడా అసలు ఈ మూవీ పై మంచి అంచనాలు అనేవి ఏర్పడ్డాయి. ఇక మే 27 వ తేదీన విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇక ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది.అలాగే వీక్ డేస్ లో కూడా ఈ మూవీ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది.ఇక 'ఎఫ్3' మూవీకి ప్రపంచవ్యాప్తంగా కూడా రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 


మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం మొత్తం రూ.47.74 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్ ఇంకా అలాగే వరుణ్ తేజ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అయితే బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఈ ఈ మూవీ రూ.16.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఇది ఇప్పుడు అసాధ్యం అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజే 'మేజర్' 'విక్రమ్' వంటి క్రేజీ సినిమాలు విడుదల అయ్యాయి.పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా పొద్దుట్నుంచి ఈ సినిమాల గురించి ఒక రేంజిలో చర్చ నడుస్తుంది. పైగా ఈ రెండు కూడా పాన్ ఇండియా సినిమాలు. ఇక టాక్ బాగింటే పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజిలో వసూళ్లు కోళ్లగొడతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మరి వాటి పోటీని తట్టుకుని ఈ f3 మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: