ఇక అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో నాగ బాబు క్రియా శీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తమ్ముడు జనసేన పార్టీలో కూడా చేరి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తమ్ముడికి రాజకీయంగా ఈయన అండగా నిలుస్తున్నారు.తాజాగా నాగబాబు అన్నయ్య చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై స్పందించారు. ఇక సినిమాల్లోంచి రాజకీయాల్లో వచ్చి ప్రజారాజ్యం తరుపున 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఆపై కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభకు ఎంపికై అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో కేంద్ర పర్యాటక శాఖ (స్వతంత్య్ర) మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఏపీ కాంగ్రెస్ తరుపున స్టార్ క్యాంపెనర్‌గా కూడా ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా గెలవలేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇకపై సినిమాలతోనే ట్రావెల్ అవుతారు. ఆయన ఇక ఏ రాజకీయ పార్టీల్లో చేరరు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక అక్కడే ఆయనకు మనశ్శాంతిగా ఉంటోందన్నారు. ఈయన రాజకీయాల్లో వచ్చే ఆలోచన కూడా లేదన్నారు. అలాగే ఆయన్ని రమ్నని కూడా కోరమన్నారు.నాగబాబు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి మొదటి సినిమాగా 'రుద్రవీణ' సినిమాను తెరకెక్కించాడు.
కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా కానీ కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత 'త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు ఇంకా బావగారు..బాగున్నారా' వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రం హిట్ అయ్యి కాస్తా పర్వాలేదనిపించింది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన 'గుడుంబా శంకర్', ఇంకా రామ్ చరణ్‌తో చేసిన 'ఆరెంజ్' సినిమాలు రెండు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నిజంగా నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.ఇక ఈ దెబ్బలతో నాగబాబు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. ఇక నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు. ఏ విషయంలో నైనా తనకు అన్న మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు నాగబాబు.