విక్రమ్ : వావ్! ఖచ్చితంగా ఇది మాస్టర్ పీస్ చిత్రం!

Purushottham Vinay
కమల్ హాసన్ ఎప్పుడూ కూడా తన సినిమాలలో ఏదో ఒక ఆలోచన ఇంకా కొత్తదనం క్రియేట్ చేస్తుంటాడు. అయితే కొన్ని సార్లు అవి సామాన్యులకు అర్థంకావు. చాలా మెచ్చూర్డ్‌గా వుంటాయి. ఇక ఈ విక్రమ్ సినిమా కూడా అలాంటిదే. కొకైన్ అనే మాదకద్రవ్యంపై ఇప్పటికి కూడా చాలా సినిమాలు వచ్చాయి. సిండికేట్ ముఠాను పట్టుకుకోవడం ఇక అందులో కొంతభాగాన్ని అధికారులు నొక్కేసి కాష్ చేసుకోవడం, ఇలా ఎన్నో ఈ రక రకాలుగా కథలు వున్నాయి. కానీ విక్రమ్‌ సినిమాలో కమల్‌హాసన్ చెప్పిన పాయింట్ అయితే ఖచ్చితంగా ఆలోచించేదిగా వుంది. కొకైన్‌ను కొంచెమే కదా అని తెలియకుండా పుచ్చుకుంటే అది మనిషిని ఎంతమేరకు దిగజారుస్తుందో వివరిస్తాడు. దేశంలో కొకైన్ ఎక్కైపోయి మనిషి మనుగడ కూడా నశించిపోతుంది.ఒక్కోసారి జంతువులా బిహేవ్ చేస్తాడు. వావివరుసలు కూడా మర్చిపోతాడు. అందుకే దీన్ని అంతం చేయాలనేది విక్రమ్ సినిమాలో డైలాగ్ రూపంలో చాలా చక్కగా వివరిస్తాడు.ఇక మిగిలిన కథంతా డైరెక్టర్ లోకేష్ గత చిత్రం ఖైదీ తరహాలో గ్యాంగ్ ముఠా, రాత్రి పూట యాక్షన్ సన్నివేశాలు కాల్పులు ఇంకా కత్తులతో దాడి ఇవన్నీ వున్నాయి.




విజయ్ సేతుపతి నడక మేనరిజం చాలా కొత్తగా అనిపించి ఆకట్టుకుంటంది. పోలీసు అధికారిగా ఫాహద్ ఫాజిల్ లను కూడా సరిగ్గా వాడుకుని 'విక్రమ్' సినిమాను జనరంజకంగా మలిచాడు దర్శకుడు. కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పాత్ర మేరకు తను ప్రాణం పోసి బాగా చేశాడు. గుండె వీక్‌గా వున్న తన మనవడి గురించి కమల్ పడే తపన ఇంకా ఆయన ఆరాటం చక్కగా నటనలో ఆవిష్కరించాడు. అయితే మొదటి భాగమంతా కూడా ఫాజిల్ హీరోగా సాగుతుంది. అక్కడక్కడా కమల్ హాసన్ కనిపిస్తాడు. సెకండాఫ్‌లో కూడా అంతే. కానీ ప్రతి సన్నివేశం కమల్ హసన్ పాత్రతోనే ముడిపడివుంటుంది. సీనియర్ నటుడిగా తెరపై తాను ఎక్కువ కనిపించకుండా ఇతరనటులతో డీల్ చేయడం అనేది చాలా గొప్ప విశేషం.ఇక ఫైనల్‌గా సూర్య పాత్ర కనిపించి విక్రమ్‌కు సీక్వెల్ కూడా తీయవచ్చు అనే హింట్ కూడా వదిలాడు డైరెక్టర్.మొత్తానికి ఇదొక మాస్టర్ పీస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: