మేజర్ సినిమా ఓటిటిలో వచ్చేది అప్పుడే..?

Divya
డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవిశేషు ముఖ్యమైన పాత్రలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా శోభిత దూలపల్లి కలిసి నటించిన చిత్రం మేజర్. ఈ చిత్రానికి మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ తదితరులు నిర్మాతగా వ్యవహరిస్తారు. మేజర్ సినిమా..26/11 ముంబై టెర్రరిస్టు దాడులు వీరమరణం పొందిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అత్యధిక థియేటర్లలో ప్రదర్శించడం జరుగుతోంది. ఈ చిత్రం మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైన హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు భారత దేశ చరిత్రలో ఏ చిత్రం సాధించలేని అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నది. దేశంలోని తొమ్మిది ప్రధానమైన నగరాలలో ఈ చిత్రం ప్రీమియర్ షో లు వేస్తూ సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తోంది. ప్రస్తుతం థియేటర్లో కూడా ఈ సినిమా అద్భుతమైన టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. సాధారణంగా థియేటర్ లో విడుదలైన తర్వాత.. థియేటర్ రన్ పూర్తి కాగానే ఆ చిత్రం ఓటిటీలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే మేజర్ సినిమా కూడా విడుదల హక్కులు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు కోన్నట్లుగా తెలుస్తోంది.



నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నట్లు సమాచారం ఇవ్వకపోతే ఈ చిత్రం ఓటిటి లో విడుదల చేయడానికి సంబంధించిన సమాచారాన్ని నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఓటిటీ లో విడుదలవుతోంది అన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో విడుదల కాబోతోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మేజర్ సినిమా అయితే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా మలయాళం దూసుకు వెళ్తుంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: