జాతీయ ఉత్తమ నటుడు ఇలాంటి పాత్రలు చేస్తున్నాడేంటి..!!

Divya

కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. ఆ తర్వాత రోజులలో తన విలక్షణమైన నటనతో తమిళనాడులో మక్కల్ సెల్వన్ గా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే జాతీయ ఉత్తమ నటుడిగా కూడా పలు అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పాటు బిజీగా ఉండే నటుడిగా కూడా పేరు పొందాడు. ఇక బాష తో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్ సేతుపతి. అయితే గత కొంత కాలంగా తన రేంజ్కి తగ్గ పాత్రలనే ఎంచుకోవడం లేదని ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.


తనకు నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా విజయ్ సేతుపతి ఉన్నారు. ఒకే భాషలో అటు హీరోగా ఇటు విలన్గా పోలి ఉండే చిత్రాలలో నటించడం కేవలం విజయ్ సేతుపతికే చెందుతోందని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు విక్రమ్ సినిమాలో విలక్షణమైన నటుడిగా చేసిన పాత్ర చూస్తే.. ఇలాంటి బి-గ్రేడ్ పాత్రలను కూడా చేయడానికి ఎలా ఒప్పుకున్నారని అభిమానులు తెలియజేస్తున్నారు. మాస్టర్ సినిమాలో పూర్తిస్థాయిలో విలన్ గా నటించిన అప్పటికీ హీరోతో ఎక్కువగా ఉండే పాత్ర కావడంతో ఎలాంటి సమస్య ఎదురుఆవ్వలేదు.. కానీ ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో మాస్ లోకల్ విలన్గా కనిపించదని సెకండాఫ్లో ఆ పాత్రకు ప్రాధాన్యత తగ్గించడంతో ఆయన అభిమానులు సైతం నిరుత్సాహంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక క్లైమాక్స్ లో కూడా రెగ్యులర్ విలన్ క్యారెక్టర్ లో తనని చంపేయడం కూడా వారు జీర్ణించుకోలేక పోతున్నారట. ఇటీవల కాలంలో విజయ్ సేతుపతి నటించిన లభామ్, తుగ్లక్, దర్బార్, అన్నాబెల్లె వంటి తదితర సినిమాలలో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయారు. ఇక తాజాగా విడుదలైన KRK సినిమా కూడా ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది.. ఇక విక్రమ్ సినిమాలో కమల్ హాసన, ఫాహద్ ఫాజిల్ , పాత్రలకు మంచి పేరు రావడం జరిగింది కానీ విజయ్ సేతుపతి కి అలాంటి ప్రశంసలు దక్కడం లేదు. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేష్ కనకరాజు తమ అభిమానిని ఎలా ఇలా చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: