సూపర్ న్యూస్ : మహేష్ కోసం జర్మనీకి త్రివిక్రమ్ ... అందుకోసమేనా .... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు రెండూ కూడా ఆడియన్స్ నుండి మంచి పేరు అందుకున్నాయి. వాస్తవానికి వీటిలో అతడు మంచి విజయవంతం అవగా, ఖలేజా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. అయినప్పటికీ ఈ రెండు సినిమాల్లో మహేష్ చేసిన రోల్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకాభిమానుల మనసులో నిలిచి ఉండడం విశేషం.

ఇక త్వరలో మహేష్, త్రివిక్రమ్ కలిసి హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఒక భారీ సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఇటీవల అధికారికంగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవలం మహేష్ ఫ్యాన్స్ లో మాత్రమే కాక యావత్ ఆడియన్స్ అందరిలో కూడా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈపాటికి ప్రారంభం కావలసిన ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అవడం ఆలస్యం వలన జులై లో ప్రారంభం కానున్నట్లు టాక్.

అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క పూర్తి స్క్రిప్ట్ నిన్నటితో కంప్లీట్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్ లతో కలిసి మహేష్ బాబుని కలవడానికి జర్మనీ నేడు బయల్దేరివెళ్లినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీ తో కలిసి జర్మనీ వెళ్లిన మహేష్ బాబు, ప్రస్తుతం హాలిడే అక్కడే గడుపుతున్నారు. కాగా త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసారని, సూపర్ స్టార్, మాటల మాంత్రికుడి మూడవ కలయికలో రానున్న ఈ మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: