యాంకర్ అనసూయ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

Anilkumar
అనసూయ పేరు తెలియని వరంటూ ఉంటారు.అయితే ఈమె బుల్లితెరపై అందాల యాంకర్ గా, నటిగా పేరు పొందింది యాంకర్ అనసూయ.ఇకపోతే  దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ నే ఉన్నది.ఇకపోతే ఈ షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం అటు వెండితెరపై .. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగిస్తోంది. అయితే ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు వైపు కూడా తన మార్కును చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది అనసూయ. కాగా ప్రస్తుతం అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉందని చెప్పవచ్చు. అయితే తాజాగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నది.

ఇకపోతే గత ఏడాది అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో సునీల్ భార్య పాత్రలో బాగా నటించింది. కాగా అనసూయకు వివాహమైన తరువాతే పలు అవకాశాలు వస్తూ కెరియర్ చాలా సాఫీగా సాగిపోతోంది. ఇప్పుడు ప్రస్తుతం అనసూయ చిరంజీవి తో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  వీరిద్దరి కాంబినేషన్లో శుభ గృహ కు సంబంధించి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా నటించారు. అయితే ఈ యాడ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. కాగా ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ ఉంటుంది అనసూయ.అయితే ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అనసూయ జబర్దస్త్ షో కి రెమ్యూనరేషన్ గా ఏడాదికి..

 రూ.70 లక్షలు అందుకుంటున్న ట్లుగా సమాచారం.అంతేకాదు  మిగిలిన షో లకీ ఒక్కో ఎపిసోడ్ కు లక్ష రూపాయల వరకు అనుకుంటుందట.కాగా సినిమాలకైతే ఒక రోజుకు రూ.1.5 లక్షలు అనుకుంటుందట. అంతేకాదు ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయితే.. రూ.5 లక్షల వరకు అందుకుంటుందట.ఇకపోతే  అనసూయా కి హైదరాబాద్ లో ఒక లగ్జరీ హౌస్ ఉంది. ఇక దాని విలువ రూ.8 కోట్లు ఉంటుందట. అంతేకాదు అనసూయ దగ్గర కేవలం రెండుకార్లు మాత్రమే ఉన్నాయి కాగా వాటి విలువ రూ.1.5 కోట్లు.ఇకపోతే  అనసూయ ఆస్తి విలువ సుమారుగా రూ.70 కోట్ల రూపాయలకు పైగా నే ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: