మరో ఇద్దరు తెలుగు ప్రొడ్యూసర్ లను లైన్ లో పెట్టిన ప్రశాంత్ నీల్..!

Pulgam Srinivas
కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కే జి ఎఫ్ మూవీ తో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


ఇప్పటి వరకు సలార్ సినిమా షూటింగ్ 35 శాతం వరకు పూర్తి అయినట్లు ఈ సినిమా ప్రొడ్యూసర్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. అలాగే సలార్ సినిమా షూటింగ్ ను ఈ సంవత్సరం చివరి కల్లా పూర్తి చేయబోతున్నట్లు కూడా ప్రొడ్యూసర్ తెలియజేశాడు. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమా ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా 31 వ సినిమా. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన తదుపరి సినిమాకు హీరోను , ప్రొడ్యూసర్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా తర్వాత మరో ఇద్దరు టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్లు తెరకెక్కించబోయే సినిమాలకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.


ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ సినిమా తర్వాత డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఒక సినిమాను , దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే డి.వి.వి.దానయ్య 'ఆర్ ఆర్ ఆర్' లాంటి భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మించగా,  దిల్ రాజు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: