మేజర్... విక్రమ్ జోరుకు తట్టుకుని నిలబడ్డ 'ఎఫ్3'..!

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయినా విషయం మన అందరికీ తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుండి కూడా మంచి ప్రేక్షకాదరణ పొంది మంచి , బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.  అలా మంచి టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం వల్ల, అలాగే పోయిన వారం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే సినిమా నుండి పెద్దగా పోటీ లేకపోవడంతో ఎఫ్ 3 మూవీ కి మొదటి వారం రోజులు మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి.


కాకపోతే నిన్న అనగా జూన్ 3 వ తేదీన మేజర్ మరియు విక్రమ్ మూవీ లు థియేటర్ లలో విడుదల అవ్వడం, ఈ రెండు సినిమా లకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఎఫ్ 3 మూవీ కలెక్షన్ లపై కాస్త ప్రభావం చూపినప్పటికీ పెద్దగా మాత్రం ప్రభావం చూపలేదు.   ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.


8 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 39.54 కోట్ల షేర్ , 63.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
8 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో  2.67 కోట్లు, ఓవర్ సీస్ లో 6.80 కోట్ల కలెక్షన్ లను సాధించింది. 8 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 49.01 కోట్ల షేర్ , 81.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: