ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నా యి. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగుకు వెళ్లబోతుండగా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు చిత్రాల ద్వారా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకులను దేశవ్యాప్తంగా అలరించి పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవడమనే ఉద్దేశంతో ఈ సినిమాలను చేస్తున్నాడు.
ఎన్టీఆర్ 30వ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ అంతకుమించిన అంచనాలు మా త్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాపై ఉన్నాయని చెప్పవచ్చు. కారణం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా ప్రశాంత్ కి మం చి పేరుంది. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా ఘన విజయాన్ని అందుకుని బాహుబలి రికార్డులను సైతం చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన తో సినిమా చేస్తే తప్పకుం డా పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయం అని భావించిన హీరోలు చాలామంది ఆయనతో సినిమాలు చేయాలని భావిస్తూ ఉన్నారు
అలా ఆయనతో సినిమా చేసే అవకాశం ఇద్దరు తెలుగు హీరోలకు వరించడం విశేషం. ప్రభాస్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో కలిసి సలా ర్ చిత్రాన్ని మొదలుపెట్టగా దాని శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తూ ఉండటం విశేషం. ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కుతు న్న ఈ చిత్రం ఏ స్థాయిలో తెరకెక్కుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్ ఒకటి ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉం టుందో చూడాలి.