టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన మేజర్ ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ఈ చిత్ర దర్శకుడు శశి కరణ్, హీరో అడవి శేష్, సిని నటీనటులు ఇంకా సాంకేతిక బృందం ముచ్చటించారు. ఈ సందర్భంగా అడవి శేష్ ఒక కీలక ప్రకటన కూడా చేశారు. అదేమిటి అంటే సైన్యంలో చేరాలని ఆసక్తి కనబరిచే యువతకు తమ వంతు సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సినీ హీరో అడవి శేష్ ప్రకటించారు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది కూడా ఆర్మీలో చేరాలంటూ తమ ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మెసేజ్ లు పంపిస్తున్నారు అని పేర్కొన్న అడవి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అలా మెసేజ్లు చేసిన వారికి సైన్యంలో చేరాలని ఆసక్తి చూపిస్తున్న వారికి తమ వంతు కృషి చేయడానికి డెసిషన్ అనేది తీసుకున్నామని వెల్లడించారు.ముందు పది మంది యువకులతో ఈ ప్రయత్నాన్ని మొదలు పెడతామని హీరో శేష్ పేర్కొన్నారు. అది ఎంత మందికి చేరుతుందనే విషయం ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా ఎంతో కొంత మందికి ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అడివి శేష్ ప్రకటించారు.
ముంబైలో జరిగిన 26-11 ఉగ్రదాడులలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేరళకు చెందిన సోల్జర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని మేజర్ సినిమాను రూపొందించారు అడవి శేష్ అండ్ టీం. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే బాధ్యతలు మొత్తం అడవి శేష్ దగ్గరుండి చూసుకున్నారు.సయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ఇంకా రేవతి వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఇక తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాను మలయాళం డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేశారు. తెలుగు, హిందీ ఇంకా మలయాళ భాషల్లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేశారు. సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకుని మంచి కలెక్షన్ల దిశగా కూడా పరుగులు పెడుతోంది. 26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ బడ్జెట్ తో నిర్మించింది.