ఆమెని వదలని త్రివిక్రం.. మహేష్ సినిమాలో ఛాన్స్..!

shami
మాటల మాంత్రికుడు త్రివిక్రం హీరోయిన్స్ విషయంలో చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు. తనకు హిట్ ఇచ్చిన హీరోయిన్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు త్రివిక్రం. ఆయన డైరక్షన్ లో హీరోయిన్ గా ఒక సినిమా చేస్తే ఆ నెక్స్ట్ మరో సినిమా కూడా అవకాశం అందుకున్నట్టే లెక్క. త్రివిక్రం డైరక్షన్ లో చేయకపోయినా సరే ఆయన పర్యవేక్షణలో చేసిన సినిమాలో హీరోయిన్ గా మెప్పించినా సరే అతను పిలిచి ఛాన్స్ ఇస్తాడు. ఈ క్రమంలో ఒక హీరోయిన్ కి త్రివిక్రం అవకాశం ఇస్తున్నాడని టాక్.

భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రం అన్నీ తానై నడిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో ఒక హీరోయిన్ గా నటించింది సం యుక్త మీనన్. ఆ సినిమాలో అమ్మడి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రం తన డైరక్షన్ లో చేస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడని టాక్. త్వరలో మహేష్ తో చేస్తున్న సినిమా లో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ చేయగా సెకండ్ హీరోయిన్ గా సంయుక్తని తీసుకున్నారని టాక్. అదే నిజమైతే సంయుక్త మీనన్ తెలుగు కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.

భీమ్లా నాయక్ సినిమాలో ఆమె చేసిన పాత్రకి మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోబోతుంది. ఇక మరో విషయం ఏంటంటే త్రివిక్రం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసె వారికి పెద్దగా అవకాశాలు ఉండవు. అయితే సం యుక్త మీనన్ మాత్రం త్రివిక్రం సినిమా ఛాన్స్ వస్తే చాలు ఎలాంటి పాత్ర అయినా చేసానని అంటుందట. మళయాళంలో వరుస అవకాశాలు అందుకుంటున్న సంయుక్త మీనన్ తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఇదే కాకుండా ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: