ఆ విషయంలో నాగార్జున ఊహించింది కరెక్టేనా..!!

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. టికెట్ రేటు గురించి ఆ సమయంలో నాగార్జున కూడా కొన్ని ప్రశ్నలు ఎదురు కాగా ఆంధ్రప్రదేశ్లో తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగానే బంగార్రాజు సినిమా తెరకెక్కించడం జరిగింది అని తెలియజేశారు. టికెట్ల రేటు తక్కువగా ఉందని అది తన సమస్య కాదని నాగార్జున ఆ సమయంలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సినిమాల పరిస్థితి చూస్తే నాగార్జున చెప్పింది నిజమే అన్నట్లుగా వార్త వినిపిస్తోంది.

ఈ ఏడాది విడుదలైన ఎక్కువ సినిమాలలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలే ఫెయిల్యూర్ గా నిలిచాయి. మరి కొన్ని సినిమాలు హిట్ టాక్ మాత్రం సొంతం చేసుకున్నాయి. చాలా ఏరియాల్లో కూడా కొన్ని చిత్రాలు బ్రేక్ ఈవెంట్స్ కూడా సాధించలేకపోయాయి. బంగార్రాజు సినిమా విడుదల సమయంలో నాగార్జున టికెట్ల రేట్లు పెంచడం వల్ల థియేటర్ మార్కెట్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని కామెంట్లు చేశారు. దీంతో థియేట్రికల్ మార్కెట్ దెబ్బతింటే ఆ ప్రభావం నిర్మాతలు, హీరో ఇతర అంశాల పైన పడుతుందని నాగార్జున హెచ్చరించారు. ఇప్పుడు పెద్ద చిత్రాలు సాధారణ టికెట్ ధరలకే అమ్మబోతున్నామని నిర్మాతలే ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదే సమయంలో తమ సినిమా ఓ టి టీలో ఆలస్యంగా విడుదల కానుందని ప్రచారం కూడా చేసుకోవాల్సి వస్తోంది.. ఇక నాగార్జున కూడా ఓటీటీ గురించి గతంలో మాట్లాడుతూ.. ఓ టి టి థియేటర్ కు సమాంతరంగా నడవాలని థియేటర్ కు ఓటీటీ ప్రోత్సాహం కాకూడదని తెలియజేశారు. థియేటర్ను వదిలేసి ఓ టి టి లో సినిమా చూసే పరిస్థితి రాకూడదని ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కానీ పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు బాగా పెంచడం వల్ల సినిమాలకు నష్టాలు తప్పడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక పెద్ద చిత్రాల నిర్మాతలు దర్శకులు, హీరోలు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూ వెళితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకులు థియేటర్ల సినిమాను చూసే సంఖ్య భారీగా తగ్గిపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: