RC 15 : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భారీ చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ ఇంకా అలాగే ట్రిపులార్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన చెర్రీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి.ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్‌సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కీలక సన్నివేశాలను కూడా చిత్ర యూనిట్ తెరకెక్కించింది.ఇంకా త్వరలోనే హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త తెగ సందడి చేస్తోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమా కోసం ‘సర్కారోడు’ అనే మాస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.
చెర్రీ మాస్‌కు ఇమేజ్‌కు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ కూడా ఆలోచిస్తున్నారు.ఇక అంతేకాకుండా ‘అధికారి’ అనే క్లాస్ టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ రెండింటిలో త్వరలోనే ఏదో ఒక టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది. మరి చిత్ర యూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు యస్ యస్ తమన్ సంగీతం అందిస్తుండగా చెర్రీకి జోడిగా కియారా అద్వాణీ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై అభిమానులకు ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.ఖచ్చితంగా ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు అభిమానులు.