విక్రమ్ ఓటిటి హక్కులను దక్కించుకున్న సంస్థ..!!
అయితే ఈ చిత్రం ఆరు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల కానున్నట్లు గా సమాచారం. అది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ఓ టి హక్కులను కొనుగోలు చేసింది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఆలస్యంగానే ఓటి లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి భారీగానే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఇందులో సూర్య కూడా గెస్ట్ రోల్ పాత్రలో కనిపించారు. అందుకు భారీగానే రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు గా సమాచారం.
ఇక ఇందులో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటించారు దీంతో ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. తెలుగు సినిమా హక్కులను హీరో నితిన్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది ఈ చిత్రానికి మంచి లాభాలు కూడా వస్తున్నట్లుగా సమాచారం. ఈ వీకెండ్ నాటికి సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.. దీంతో 3 సినిమా హవా భారీగా తగ్గిపోవడంతో మేజర్, విక్రమ్ సినిమాలకు బాగా ప్లస్ అయ్యింది. మరి ఈ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబడుతోంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.