మూడు రోజుల్లోనే 150 కోట్ల మార్క్ ని టచ్ చేసిన విక్రమ్..!

Pulgam Srinivas
లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ క్రేజీ దర్శకులలో ఒకరు ఆయన లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా, విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్,  ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో నటించారు. అలాగే సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించాడు.  


కమల్ హసన్ ఈ మూవీ లో హీరోగా నటించడం,  హేమాహేమీలు అయిన నటీనటులు ఈ సినిమాలో నటించడం,  లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ , తెలుగు , మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయిన విక్రమ్ సినిమా విడుదల అయిన మొదటి షో నుండే అదిరిపోయే పాజిటివ్ టాక్ ను బాక్సాఫీస్ తెచ్చుకుంది.  అలా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి.


అందులో భాగంగా విక్రమ్ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 150.28 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేయగా , 100.26 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది. ఇలా విక్రమ్ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 150 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసి ప్రస్తుతం కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటోంది. విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1 వ రోజు 31.20 కోట్ల షేర్ , 61.13 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయగా, 2 వ రోజు 19.60 కోట్ల షేర్ , 39.13 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయగా, 3 వ రోజు 25.05 కోట్ల షేర్ , 50.02 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: