అతడే నా సర్వస్వం : శృతి హాసన్

Purushottham Vinay
ఇక సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల విషయంలో ప్రేమలు బ్రేకప్ కి చాలా సర్వసాధారణం.ఈ విధంగా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ప్రేమలో పడి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకొని తరువాత ఇతరులతో వారి జీవితాన్ని పంచుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు.ఇక ఇలాంటి వారిలో నటి శృతిహాసన్ కూడా ఒకరు. ఈమె కెరియర్ అద్భుతంగా కొనసాగుతున్న సమయంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో ప్రేమలో పడి తన కెరీర్ ను కూడా ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన వీరిద్దరికీ మనస్పర్థలు అనేవి ఎక్కువ రావడంతో శృతిహాసన్ తనతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇకపోతే ఆ తరువాత ఈమె ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతన హజారికా అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. ప్రస్తుతం ముంబైలో వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో నివసిస్తూ డేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక నిత్యం వీరిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదు.ఇక గత కొద్ది రోజుల క్రితం పెళ్లి గురించి శృతిహాసన్ అని ప్రశ్నించగా తనకు పెళ్ళంటే చాలా ఆందోళనకరంగా ఉంది అంటూ ఆమె సమాధానం చెప్పుకొచ్చారు.
అలాగే ఇక తాజాగా మరోసారి ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సుదీర్ఘంగా ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితానికి అలాగే వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ప్రపంచంలో మీరు అమితంగా ప్రేమించే వ్యక్తి ఎవరు అంటూ ఆమెను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు హీరోయిన్ శృతిహాసన్ సమాధానం చెబుతూ కెమెరాను పక్కనే ఉన్న తన ప్రియుడి వైపు చూపిస్తూ తానే తన సర్వస్వం అని ఈ సందర్భంగా శ్రుతిహాసన్ తన ప్రియుడు గురించి ఆమె తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం శృతిహాసన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఓ సినిమాలో ఇంకా అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ వంటి సినిమాలలో నటిస్తూ మళ్ళీ ఫుల్ బిజీ హీరోయిన్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: