జూన్ 3 వ తేదీన మేజర్ ,
విక్రమ్ సినిమాలు
థియేటర్ లలో విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలకు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ రెండు సినిమాలకు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు దక్కడంతో ఎఫ్ 3
మూవీ కలెక్షన్ లు అమాంతం పడిపోయాయి. ఇది ఇలా ఉంటే నిన్న అనగా ఆదివారం రోజు ఎఫ్ 3 , మేజర్ ,
విక్రమ్ సినిమాలకు కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. కాకపోతే ఈ మూడు సినిమాలలో ఆదివారం రోజు అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమాదే పైచేయి అయ్యింది. ఆదివారం రోజు మేజర్
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.57 కోట్ల షేర్ , 5.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర సాధించి,
విక్రమ్ ఎఫ్ 3
మూవీ లకు గట్టిపోటీని ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ రెండు సినిమాలతో పోలిస్తే అత్యధిక కలెక్షన్లను కూడా మేజర్
సినిమా బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది.
ఆదివారం రోజు
విక్రమ్ సినిమా 2.59 కోట్ల షేర్ , 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేయగా , ఎఫ్ 3
మూవీ 1.35 కోట్ల షేర్ , 2.30 గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.