"ఆదిపురుష్" లో కృష్ణంరాజు... దేవుడా ఈసారైనా కాపాడు?

VAMSI
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అప్పటి నుండి ఈ హీరో చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇక రెబల్ స్టార్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా బిజినెస్ లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఇటీవల ఈ హీరో నుండి వచ్చిన సాహో, రాదేశ్యాం రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. కానీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు సరికదా డార్లింగ్ పాపులర్ మరింత పెరిగింది. ప్రభాస్ కు డైహార్టెడ్ అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. సినిమా ఫలితాల పై ఆధారపడకుండా ఈ స్థాయిలో అభిమానుల సైన్యాన్ని తన వెంట నిలుపుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఈ హీరో ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉండగా....ఈ హీరో క్రేజీ ప్రాజెక్ట్ ఆది పురుష్ గురించి ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.

పౌరాణిక నేపథ్యం లో తెరకెక్కుతున్న  ఈ భారీ బడ్జెట్ చిత్రం లో  ప్రభాస్ పెదనాన్న , సీనియర్ హీరో కృష్ణం రాజు కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈ మూవీలో జనకమహారాజు పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారట. కాగా ఈ విషయం విని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ లాంటి హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సీనియర్ స్టార్ హీరో కృష్ణం రాజు అంటే ఈ తరం ప్రేక్షకులకు కూడా పర్సనల్ గా చాలా అభిమానం , ప్రేమ. అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే వచ్చే సంతోషమే వేరు అంటున్నారు. కాగా మరోవైపు కొందరు అభిమానులు మాత్రం ఈ విషయం పై ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నటుడు కృష్ణంరాజు హీరో ప్రభాస్ కలిసి ఇప్పటివరకు బిల్లా, రెబల్, రాదే శ్యాం ఇలా మూడు సినిమాలు చేయగా  వాటిలో ఒకటి మాత్రం హిట్ అయ్యి మిగిలినవి నిరాశ పరిచాయి.

అందుకే ప్రభాస్ సినిమాలో పెదనాన్న అంటే కాస్త కంగారు పడుతున్నాం. నిజానికి వీరి కాంబో స్క్రీన్ పై కన్నుల పండుగగా ఉంటుంది కానీ ...ఆ చిన్న సెంటిమెంట్ కాస్త మమ్మల్ని ఇలా ఆలోచించేలా  చేస్తోంది అంటూ ఆవేదన చెందుతున్నారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కానీ...ఇదే కాంబోలో వచ్చిన బిల్లా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కాలేదు. అలాగే ఈ సినిమా కూడా అంచనాలకు మించిన ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 15 బాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దం అవుతోంది. ఈ బడా మూవీ వచ్చే ఏడాది జనవరి 12 న పెద్ద పండుగ కానుకగా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: