పుష్ప ది రూల్ : డబుల్ ధమాకా.. రికార్డ్స్ ఖాయం!

Purushottham Vinay
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పుష్ప 2 సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 విడుదల అయిన రెండు నెలల్లోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ ను కూడా మొదలు పెట్టాలని యూనిట్ సభ్యులు అనుకున్నారు.ఇక పుష్ప పార్ట్ 1 విడుదల సమయంలో అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కాని ఆరు నెలలు అవుతున్నా ఇంకా షూటింగ్ అనేది ప్రారంభం కాలేదు.పుష్ప పార్ట్ 2 సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల కోసం.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా పలు వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా కోసం స్క్రిప్ట్ పార్ట్ 1 విడుదలకు ముందే రెడీగా ఉంది. కాని ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను పూర్తిగా మార్చేసి కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్ కూడా ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకా అన్నట్లుగా పుష్ప 2 లో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. సినిమా మొదటి పార్ట్ ఎక్కడైతే పూర్తి అయ్యిందో అక్కడ నుండి మళ్లీ పార్ట్ 2 కథ ప్రారంభం అవుతుంది. 



కాల క్రమేనా వేల కోట్ల ఆస్తులు సంపాదించి పుష్ప అండర్ వరల్డ్ డాన్ గా మారుతాడు. ఆయన తనయుడు మరో అల్లు అర్జున్ పాత్ర ను కూడా కొత్తగా డిజైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.పుష్ప 2 సినిమా గురించి ఇప్పటి వరకు ఎన్నోరకాల పుకార్లు షికార్లు చేశాయి.. ఇంకా అవి చేస్తూనే ఉన్నాయి. అందులో ఏవి నిజం.. ఏవి అబద్ధం అనే విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా ఉంది. ఈ కొత్త పుకార్లలో నిజం ఎంత అనే విషయం పై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. ఒక వేళ బన్నీ కనుక డబుల్ రోల్ లో పుష్ప 2 లో కనిపిస్తే ఖచ్చితంగా అది అభిమానులకు పండుగే.ఇక మొత్తానికి అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల నుండి రాబోతున్న పుష్ప 2 ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ వన్ పెద్దగా వసూళ్లు సాధించలేకపోయిన జనాల్లోకి మాత్రం బాగా వెళ్ళింది. ఖచ్చితంగా పార్ట్ 2 పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈసారి వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు ఖాయంలా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: