అలనాటి హీరోయిన్లు ఎంత మంది ఉన్నా కూడా
హీరోయిన్ రంభ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈమె రెండు దశాబ్దాల క్రితం బావగారు బాగున్నారా ,హిట్లర్ తదితర సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి
సక్సెస్ ఫుల్
హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.
రంభ 20 దశాబ్దాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ కూడా అలాగే తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది. 1990 తరం
హీరోయిన్ చాలామంది ఇప్పుడు అమ్మ, అంటి తదితర పాత్రలలో కనిపిస్తున్నారు కానీ
రంభ ని అలా చూడడానికి మాత్రం ప్రేక్షకులు కోరుకోవడం లేదు.
అందుకు కారణం ఆమె అందమే అని చెప్పవచ్చు సహజంగా వయసు పెరుగుతున్న కొద్దీ మొహం లో మార్పులు వస్తూనే ఉంటాయి కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అలా ఏమీ జరగలేదు.. ప్రస్తుతం ఈ ఫోటో చూస్తుంటే మనకు అలా కనిపిస్తోంది.
రంభ పుట్టినరోజు కావున అందుకు సంబంధించి ఈ రోజున ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐదు పదుల వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తోంది . ఇక ఈమె అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
రంభ తోటి
హీరోయిన్స్ మరియు ఆమే తో వర్క్ చేసిన హీరోలు కూడా అంత సినిమాలకు గుడ్ బై చెప్పేశారని చెప్పవచ్చు. ఇక
రంభ మాత్రం ఇంకా కుర్రహీరోయిన్ మాదిరిగా కనిపిస్తోంది..
రంభ ఆ మధ్య కాస్త బరువు పెరిగినట్టు కనిపించిన కష్టపడి బరువు తగ్గినట్లుగా కనిపిస్తోంది. దీంతో
రంభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమె అభిమానులు సైతం తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నారు.
హీరోయిన్ గా కాకపోయినా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన ఈమె ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.