నాగబాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా, టీవీ షోలకు జడ్జిగా పలు అవతారాలు ఎత్తి.... ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిగానే కొనసాగుతున్నారు.అయితే ఈయన మొదట రాక్షసుడు సినిమాలో చిరంజీవితో కలిసి తెరంగేట్రం చేసిన నాగబాబు తరువాత హీరోగా మారారు.ఇక అది కలిసి రాకపోవడంతో నిర్మాతగా మారి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, ఆరెంజ్ సినిమాలు తీశారు. అయితే ఇందులో రుద్రవీణ కమర్షియల్ గా హిట్ కాకున్నా మంచి టాక్ మాత్రం వచ్చింది.కాగా  తరువాత బావగారు బాగున్నారా ఫర్వాలేదనిపించింది.


 అయితే కానీ.... నిర్మాతకు నాగబాబుకు మిగిలింది శూన్యమే.అయితే తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి మెప్పించారు. కాగా పిదప జబర్దస్త్ షోకు జడ్జిగా చాలా కాలం పాటు వ్యవహరించారు. ఇకపోతే జడ్జిగానే ఎక్కువ మొత్తంలో సంపాదన చేశారు. అయితే దీంతో ఇప్పుడు మెగా బ్రదర్స్ కు ఏ మాత్రం తీసిపోని సంపాదన నాగబాబు సొంతం అయింది.అసలు విషయం ఏమిటంటే  ఆయన ఆస్తులు మొత్తం కలిపి రూ.41 కోట్లు ఉన్నట్లు ఆ మధ్య నరసాపురం ఎంపీకి పోటీ చేసిన సందర్భంలో అఫిడవిట్ లో పేర్కొన్నారు. అంతేకాదు నాగబాబు ఆస్తుల విలువ అంత పెద్ద మొత్తంలో ఉండటంతో అందరు ఆశ్చర్యపోయారు.అయితే...కానీ ఆయనకు టీవీషోలే ఎక్కువగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.


ఇకపోతే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నాగబాబు కీలకంగా వ్యవహరించారు. ఇక దీంతో తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి కూడా పెద్దదిక్కుగా మారి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇక్కడ రఘురామ కృష్ణం రాజు గెలిచారు. ఇకపోతే ప్రస్తుతం కూడా జనసేనలో కీ రోల్ పోషించేందుకు నాగబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి నాగబాబు జనసేనలో అన్ని తానై చూసుకుని తమ్ముడు పవన్ కల్యాణ్ కు అండగా నిలిచేందుకే సిద్ధమైనట్లు సమాచారం.ఇకపోతే సినిమాలు నిర్మించే పనికి దూరంగా ఉంటూ...టీవీ షోలతోనే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అయితే....అందుకే ఆయన ఆస్తుల విలువ అంతలా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: