విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా ,సిమెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ మే 27 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుండే మంచి టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకున్న ఎఫ్ 3 మూవీ మొదటి వారం రోజుల పాటు మంచి కలెక్షన్ లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.
మొదటి వారం రోజుల్లో ఈ సినిమా చూపించిన జోరు చూస్తే ఈ సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ ఫార్ముల ను కంప్లీట్ చేసుకొని లాభాలను తీసుకునే విధంగా కనిపించింది. కాకపోతే ఆ తర్వాతి వారం మేజర్ , విక్రమ్ మూవీ లు థియేటర్లలో విడుదల అవ్వడం , ఈ రెండు సినిమాలకు కూడా అదిరిపోయే బ్లాక్బస్టర్ టాక్ రావడంతో , బాక్సాఫీస్ దగ్గర ఎఫ్ 3 మూవీ జోరు చాలా వరకు తగ్గిపోయింది. దానితో ఎఫ్ 3 మూవీ కలెక్షన్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 మూవీ 11 రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.
ఈ 11 రోజులకు గాను ఎఫ్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా 52 21 కోట్ల షేర్ , 87.51 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఎఫ్ 3 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 63.60 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఎఫ్ 3 మూవీ బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇప్పటివరకు 52.21 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన ఎఫ్ 3 మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు ఇంకా 12.29 కోట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎఫ్ 3 మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ముల ను కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టతరమైన విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.