దిశా పటాని కి అప్పుడే అంత వైరాగ్యం ఏంటి..?
కారణమేదయినా కూడా ఆమె బాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ తన కెరీర్ను ఫుల్ బిజీగా మార్చుకుంది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది .తనకు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఒక పైలెట్ అవ్వాలి అనేది తన కల అని ఆమె వెల్లడించింది. అయితే తొలుత డబ్బుల కోసం మోడలింగ్ చేయడం ప్రారంభించానని ఆ తర్వాత ఆ విధమైన అవకాశాలు పెరిగి పోవడంతో అనుకోకుండా హీరోయిన్ అవ్వాల్సి వచ్చింది అని ఆమె చెప్పింది.
అలా లోఫర్ సినిమా లో అవకాశం వచ్చింది అని చెప్పింది. వచ్చిన అవకాశాన్ని వదులద్దు అని నో చెప్పడం ఇష్టం లేక ఆమె లోఫర్ సినిమా చేయగా ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రావడం చిత్రపరిశ్రమలోనే కొనసాగేలా చేసింది అని కూడా ఆమె చెప్పింది. కానీ ఆమెకు పైలెట్ అవ్వ లేకపోయాను అన్న అసతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయిందట. ఈ నేపథ్యంలో ఆమె
భవిష్యత్తులో ఏ విధమైన అడుగులు ముందుకు వేస్తుందో చూడాలి. ఇకపోతే ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించబోతుందని కూడా అంటుంది. మరి ఏ హీరో సరసన ఆమె హీరోయిన్ గా నటిస్తుందో చూడాలి.