స్టార్ హీరోస్ ఈ ముద్దుగుమ్మ ను పక్కన పెట్టడానికి కారణం..?

Divya
ఉప్పెన, బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతోంది హీరోయిన్ కృతి శెట్టి. ఇక తమిళంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్లో ధనుష్ కు జోడీగా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే టాలీవుడ్ హీరోలు మాత్రం ఈమె అసలు పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలకు జోడిగా కృతిసనన్ వరుస ఆఫర్లు ఇస్తూనే ఉన్నది. కానీ స్టార్ హీరోలైన అటువంటి వారితో ఈమె నటించేందుకు మాత్రం అవకాశం దక్కలేదని చెప్పవచ్చు.


అయితే అందుకు ముఖ్య కారణం ఈమెను  హీరోయిన్ గా ఎంపిక చేస్తే వయస్సు విషయంలో కాస్త డిఫరెంట్ కనిపిస్తోందని నెగటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే టాలీవుడ్ స్టార్ హీరోలు ఈమెను తమ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిన్నవయసులోనే కృతి శెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా సినిమాల ద్వారా మంచి సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి రూ .2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు గా  వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గ్లామర్ రోజు కు దూరంగా ఉంటూనే కృతి శెట్టి వరస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.


ప్రస్తుతం రామ్ తో కలిసి ది వారియర్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆ తరువాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలా, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, నటిస్తున్నది. ఈ సినిమాలు కూడా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అమే అభిమానులు భావిస్తున్నారు. ప్రతి సినిమా సినిమాకు కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరుగుతూ ఉండగా.. ఈమె కెరీర్ పరంగా ఎలా అడుగులు వేస్తుందో చూడాలి మరి. తెలుగు తమిళంలో పాటు బాలీవుడ్ నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం. మరి చిన్న వయస్సులోని స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎలా ఎదుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: