2022 లో 100 కోట్ల మార్క్ ని టచ్ చేసిన తెలుగు సినిమాలు ఇవే..!
ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అవలీలగా వంద కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఈ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 11 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించింది.
రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్ లను అవలీలగా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది.
సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా 100 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.