టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చలో అనే సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన
రష్మిక మందన... ప్రస్తుతం టాప్
హీరోయిన్ గా చలామణి అవుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్
వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ
కన్నడ బ్యూటీ. తెలుగుతో పాటు
తమిళ,
హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక ఇప్పటి వరకు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ
భామ తన కెరీర్లో ఎన్నో సినిమాలను వదులుకుంది. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో
రామ్ చరణ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో
రామ్ చరణ్ జోడీగా
పూజా హెగ్డే పాత్రలో ముందు
రష్మిక మందన అనుకున్నారట. కానీ ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో
రష్మిక నో చెప్పిందట.
ఇక వెండితెరకు కిరాక్
పార్టీ అనే సినిమాలో
రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు ఆ సినిమాను
బాలీవుడ్ లో
రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ రిమేక్ సినిమాలో కూడా హీరోయిన్గా
రష్మిక మందన ను అనుకున్నా కానీ ఈమె నో చెప్పడంతో కృతిసనన్ ని తీసుకున్నారు. ఇక
నాని నటించిన
జెర్సీ సినిమాను హిందీలో
రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా ముందు హీరోయిన్గా
రష్మిక అని అనుకున్నారట. కానీ ఆమె నో చెప్పడంతో ఆమె స్థానంలో మృణాల్ సేన్ ని తీసుకున్నారు.అటు
తమిళ హీరో
దళపతి విజయ్ నటించిన బీస్ట్
సినిమా లో సైతం
పూజా హెగ్డే కి బదులు
రష్మిక మందన
హీరోయిన్ గా అనుకున్నార. కానీ బీస్ట్ కథ నచ్చక
రష్మిక అందుకు నో చెప్పింది. దీంతో ఆమె స్థానంలో
పూజా హెగ్డే వచ్చి చేరింది.
ఇక
నాని తాజాగా నటించిన అంటే సుందరానికి సినిమాలో కూడా
హీరోయిన్ గా
రష్మిక మందన అయితే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట. కానీ ఈ
కన్నడ భామ అందుకు నో చెప్పడంతో ఆమె స్థానంలో
నజ్రియా నజీమ్ ను తీసుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి నాగార్జున,
నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి పాత్ర కోసం ముందు
రష్మిక మందనని సంప్రదించారట దర్శకనిర్మాతలు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు.
శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి అలాగే
మహా సముద్రం సినిమాలో శర్వానంద్ సరసన
హీరోయిన్ గా అలాగే
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వంటి అగ్ర దర్శకులు ఆఫర్స్ ఇచ్చినా వాటికి
రష్మిక మందన నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వీటిని బట్టి చూస్తుంటే
రష్మిక మందన తన కెరీర్ను ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుంటుందో స్పష్టమవుతుంది...!!