తన ఫాంహౌస్ లో పండిన పండ్ల డైరెక్టర్ కి పంపి షాక్ ఇచ్చిన పవన్..!!

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరైన పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కూడా చాలా బిజీగా ఉన్నారు ఈయన. ఇక తనకు ఎలాంటి విరామం దొరికిన సరే ఎక్కువగా తన ఫామ్ హౌస్ లోనే గడపడానికి ఇష్టపడతారు. అయితే ప్రతి ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో పండించిన మామిడి కాయలను ఇండస్ట్రీలో ఉండే కొంతమంది ప్రముఖుల కు పంపిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మామిడి కాయలను వకిల్ సాబ్ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వేణు శ్రీరామ్ భార్య గాయత్రి సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపైన స్పందించడం జరిగింది.. తన ఫామ్ హౌస్ లో పండిన పళ్లను తన కుటుంబానికి పంపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టు కాస్త వైరల్ గా మారుతోంది. ఇక వేణు శ్రీరామ్ తో పాట సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు కూడా పవన్ కళ్యాణ్ పంపించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే రాజకీయాలలో కూడా చాలా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఆయన రీ ఎంట్రీ ఇస్తూ.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అందులో హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, తదితర చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రాలను పూర్తి చేసి పూర్తిగా రాజకీయం వైపు దృష్టి పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: