అయ్యో... మహేష్ కు ఆ స్క్రిప్ట్ నచ్చలేదట ?
అయితే ఇపుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాపై మహి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో లైన్ విని ఒకే చేసిన మహి ఇపుడు సెకండ్ ఆఫ్ అంతగా బాగోలేదు అంటున్నారట. ఫస్ట్ ఆఫ్ చాలా నచ్చింది కానీ సెకండ్ ఆఫ్ లో చేంజెస్ అవసరం కొంచం మార్చండి అని దర్శకుడు త్రివిక్రమ్ కి చెప్పారట మహేష్ బాబు. మన కాంబో అంటే అతడు వంటి పక్కా బ్లాక్ బస్టర్ ఎక్ష్పెక్ట్ చేస్తారు జనాలు అలాంటిది సినిమాలో ఏ కొంచం అపశృతి జరిగినా అభిమానుల్ని నిరాశ పరిచినట్లు అవుతుంది. సో లేట్ అయినా పర్వాలేదు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉండేలా కొంచం చూసుకోండి అని చెప్పేశాడట మహి. కాబట్టి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో లో తెరకెక్కనున్న ఈ చిత్రం మరికాస్త లేట్ అయ్యేలా ఉంది.
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ చేస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే మరోసారి మహి తో స్టెప్పులేయనుంది. ఇండస్ట్రీలో మహేష్ బాబు కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పర్ఫెక్షన్ కి కేరాఫ్ అడ్రెస్స్ అంటే దాదాపు అంతా మహేష్ కే ఓటేస్తారు. ఎందుకు ఏమిటన్న విషయం తెలియదు కానీ మహి ఫ్యాన్స్ చాలా స్పెషల్. ఎందుకంటే ప్రతి స్టార్ హీరోకి సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అలాగే మహి కి కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా మహి ఫ్యాన్స్ లిస్ట్ లో భారీగా ఉండటం విశేషం. అలా అందరికీ నచ్చే హీరో మహి. అంతగా ఈయన సినిమాలు ప్రేక్షకులపై ప్రభావం చూపాయి.