షూటింగ్ లేక ఖాళీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!!

Divya
ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరూ చేతిలో పలు ప్రాజెక్ట్ చిత్రాలు ఉన్నాయి. కరోనా తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇందులో కొంతమంది హీరోలు తమ తదుపరి చిత్రాల షూటింగ్ మొదలు పెట్టకుండా ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాంటివారిలో ముఖ్యంగా మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తోంది. హీరోలందరూ ఇప్పటి వరకు వీరు పలు చిత్రాలకు కమిట్ అయ్యారు. చివరి సినిమాలతో మాత్రం భారీ విజయాలను అందుకున్నారు.
ఆ వెంటనే తన తదుపరి ప్రాజెక్టును మొదలు పెట్టకుండా ఉండడం గమనార్హం. మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమాలో షూటింగ్ లో మొదలు చేస్తారని అందరూ భావించారు కానీ ఇప్పటి వరకు ఈ సినిమా ఇంకా ప్రారంభించలేదు. ఇక అరవింద సమేత చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ ఈ మధ్యనే rrr చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చేయవలసి ఉండగా ఇంకా సెట్స్ మీదకి తీసుకు వెళ్ళ లేదు.
RRR చిత్రంలో మరొక నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆచార్య సినిమాతో డిజాస్టర్ ని అందుకున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో RC-15 సినిమా సెట్స్ మీద ఉండగా కొన్ని కారణాల వల్ల భోపాల్ షూటింగ్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. మరి తిరిగి ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారు అనే విషయం ఇంకా తెలియడం లేదు. ఇక పుష్ప ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించి రెండువ పార్ట్ ను సెట్స్ మీదికి ఇంకా తీసుకు వెళ్ళ లేదు. ఇక పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ క్రిష్ వల్ల ఈ సినిమా లేట్ అవుతున్నట్లు గా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: